ఆంధ్ర ప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కు 32 కి మీ ల దూరంలో కరీంనగర్-కామారెడ్డి దారిలో ఉన్నది. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండీ ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది. Read More
Jaishetty Ramanaiah given real identity to karimnagar history
చరిత్రకు వన్నె తెస్తున్న గురువు, బహుముఖ ప్రజ్ణాశాలి డాక్టర్ జైశెట్టి రమణయ్య ఆయన జీవితం ఒక పాఠం. యుక్త వయసు నుంచి వృద్దాప్యం వరకు ప్రతి అంకంలో ను ఏదో ఒక తళుకు..... అది మరుగునపడ్డ చరిత్ర పై ప్రసరించిన వెలుగు. కాల గర్బం లో కలిసిన గత వైభవాన్ని ఔపోసన పట్టి భావితరం ముందట నిలిపిన వాస్తవ పుటలు.......ఆయన రచనలు. సాహిత్యం, సామజిక సేవ, సాంస్కృతిక, వైతిక, ధార్మిక, అధ్యాత్మికం....ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిలో దూసుకెళ్ళటం ఆయన ప్రత్యేకత. చరిత్రకే వన్నే తెస్తున్న ఆ గురువు పేరు ... డాక్టర్ జైశెట్టి రమణయ్య. జగిత్యాల పట్టణంలో మధ్యతరగతి వైశ్య కుటుంబం లో పుట్టిన రమణయ్య చదువులోను , చేపట్టన వృత్తిలోను రాణించిన బహుముఖ ప్రజ్ణాశాళి.