"Sahiti Gautami" a source and hope for new writers
కరీంనగర్ జిల్లా సాహితీపరిమళం 'సాహితీ గౌతమి'
శతవసంతాల రుతువులో సాహితీపరిమళం వెదజల్లుతూ 18 ఏళ్లుగా రచయితలకు ప్రేరణ కలిగిస్తూ గౌతమి పయనిస్తుంది. వెలుగుల వెలుతురులోమరింతగ ప్రకాశించాల్సిన సాహిత్యం కోసం కలలుగంటున్న సాహితీ వేత్తల కళలను సాకారం చేస్తూ కరీంనగర్ జిల్లాలోని అన్ని సాహితీ సంస్థల సమన్వయంతో 1990లో సాహితీ సంస్థల సమాఖ్యగా ఆవిర్బవించింది సాహితీ గౌతమి. అప్పటి జిల్లా కలెక్టర్ సుబ్బారావు నేతృత్వంలో తెలుగుకవితను అంతర్జాతీయస్థాయిలో పరిచయం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారయణరెడ్డి ఈ సంస్థకు పూనాది వేశారు. ప్రస్తుతం సాహితీ గౌతమి అద్యక్ష, కార్యదర్శులుగా మాడిశెట్టి గోపాల్, బివిఎస్ స్వామిలు వ్యవహరిస్తున్నారు. ప్రారంభంనుంచి సదస్సులు కవిసమ్మేళనాలు,అష్టావధానాలు, వివిధ కవుల జయంతులు, చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు మొదలగు కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో సినారే పురస్కారం అందిస్తుంది.
మిత్రులందరికీ విజయ దశమి (దసరా) శుభాకాంక్షలు, మహిషాసురుని వదించింతరువాత లోకమంతా ఆ దుర్గాదేవిని కొలుస్తూ విజయోత్సవలు జరుపుకోవడంతో విజయ దశమి ఉత్సవాలు, దుర్గా నవరాత్రులు ప్రారంభమయ్యాయి, కరీంనగర్ జిల్ల విశేషాలని, చరిత్రని ముందు తరాలకి అందించాలనే సదుద్దేశ్యంతో, భవిష్యత్తులో జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకి ఏదో రూపంలో సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్‌సైటు ప్రారంభించబడినది. ఈ కాలంలో ఊరికే దాతల దగ్గర చేయి చాచి అర్థించే సంఘలు చాలా వరకే ఉన్నాయి అలాంటి వాటికన్నింటికి దూరంగా ఒక నూతన ఉత్తేజంతో నాకున్న తీరిక సమయాల్లో ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ది పరుస్తూ వస్తున్నాను, చాలా మంది మిత్రులు తమ తమ అభిప్రాయలను ఎప్పటికప్పుడు నాకు తెలియపరుస్తునారు, కొంతమంది నేను సేకరించని వారి వారి మండలాల వివరాలు నాకు పంపి సహాయపడ్డారు వారందరికీ ఈ పండుగ రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
విప్లవాల పురిటిగడ్డగ పేరుగాంచిన హుస్నాబాద్ ప్రాంతంలో సాహితీ, సాంస్కృతిక సౌరభాలు అంతే స్థాయిలో వెల్లివిరిసాయి. ఎందరోకవులు తమ సాహిత్య సుమాలు వెదజల్లుతూ ఈ ప్రాంతానికి వన్నె తెస్తున్నారు. గ్రాంధికం, అభ్యుదయం, విప్లవకవితలు రాస్తూ 'జన చైతన్యం' రగిలిస్తన్న కవులెందరో..అలాంటి కోవకు చెందిన వారిలో శనిగరం వెంకటేశ్వర్లు, సిద్దప్ప వరకవి, మేర మల్లేశం,రిక్కల సహదేవరెడ్డి, గడిపె బాలు, గడిపెమల్లెశ్, తిప్పర్తి శ్రీనివాసులు తదితరులున్నారు. ఈ ప్రాంత కవులు జానపద బాణీలతో రచనలు చేస్తు ప్రజాభిమానం చూరగొంటున్నారు. నాటితల్లి తెలంగాణ, అనాథబాలలు, వరకట్నమరణలపై పాటలు రాస్తూ ఎందరో వర్థమాన కవులు సాహిత్య సుమాలు వెదజల్లుతున్నారు.
వెయేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం పొలాస గ్రామం ఒకనాడు రాజుల రాజధానిగా విలసిల్లిన నగరం నేడు చిన్న గ్రామంగా మారిపోయింది. అనేక చారిత్ర ఆనవాళ్లు, వాస్తుశిల్పకలకు కేంద్రమైనప్పటికి పురవస్తు, పర్యాటక శాకలయొక్క నిరాదరణకు గురవుతుంది. ఇప్పటికి ఔత్సాహిక విద్యార్తులకు ,పురవస్తుశాక అధికారులకు, చరిత్రకారుల రచనలకు, పరిశీలనకు సహాయపడుతూనే ఉన్నాయి. గ్రామంలో ఉన్న వాస్తుశిల్పాల యొక్క వివరాలు.
పులస్తీశ్వరాలయం
పోలాస చెరువుకు ఉత్తరంగా తూర్పునకు అభిముఖంగా నిర్మించబడింది పులస్తీశ్వరాలయం గర్భగృహం, అంతరాళం, ముందు 16 స్థంభాల మంటపం, దీన్ని ఆనుకొని మరో 16 స్థంభాల మంటపం నిర్మించబడింది. దేవాలయం మంటపానికి ఉత్తరమున మెట్లతో కూడుకున్న పిరమిడ్ ఆకారపు శిఖరంతో పార్వతికి ఒక చిన్న గుడినిర్మించబడింది.మంటపమునకు ఉత్తరమునున్న కొనేరు బావిరూపంలో రాతి ఇటుకలతొ నిర్మించబడింది. నీటిని చేరుకునేందుకు దక్షిణ దిశలో మెట్లున్నాయి. పాస్తీశ్వరాలయం ఆవరణలో,సమీపంలోను పలు విడి ప్రతిమలు దర్శవమిస్తాయి. సప్త మాతృకల ఫలకం అతి ప్రాచినమైనది. ఏడు, ఏనిమిదవ శతాబ్దాలకు చెంది ఉంటుంది.ఈ ఫలకములపై ఏడుగురు దేవతలు ద్విహస్తములతో చెక్కబడినారు చివరల ముందు వినాయకుడు గాని వీరభద్రులుగాని లేరు. దేవతల ఆసనముల క్రింద వారి చిహ్నాలు గాని వాహనాలు గాని లేవు. చతుర్బుజములతో కూడిన దేవి ప్రతిమ కుడిచేతిలో డమరకము, ఎడమచేతిలో త్రిశూలము కింద కుడిహస్తమునందు ఖడ్గము ఎడమచేతిలో గిన్నె చెక్కబడినాయి. నందివాహనం చెక్కబడివుంది ఎడమ చేతిలో డాలు కుడిచేతిలో ఖడ్గము ధరించిన యోధుడి శిల్పము. నాగిని శిల్పము ఉర్ఠ్వ భాగమున స్ర్తీ రూపంలో నాభి నుండి కిందవరకు సర్పరూపంలో మలచబడినవి దక్షిణ హస్తమునందు ఖడ్గము వామ హస్తమునందు డాలు ధరించి ఉంది.
కరీంనగర్ డాట్ ఇన్‌ఫో ప్రత్యేకం విశ్వంలోని రహస్యాలను చేదించే సత్తా ఉందా మనలో?
2012 సంఖ్య ఇంటర్నెట్‌లో ప్రాధన్యత సంపాదించుకుంది, ప్రపంచంలోని లక్షలాది మంది రోజూ ఈ సంఖ్యను చూస్తూ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు, ఇప్పుడే 2012లో మనిషి జీవనానికి అవసరమయిన వస్తువుల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి ఆనాటి పరిస్తితులకనుగునంగా మీకు నివసించడానికి ఇళ్ళు, వస్త్రాలు, ఊపిరి పీల్చడానికి అవసరమయిన మాస్కులు, తినడానికి కావల్సిన సింథటిక్ ఫుడ్ క్యాన్‌ల అమ్మకాలు ఇంటర్‌నేట్‌లో ఊపందుకుంటున్నాయి. భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్న పరిస్థితుల్లో ప్రపంచ్చవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తో(భూతాపానికి) మనిష్య జనాభా అంతరించే సమయం దగ్గరలోనే ఉందని తెలిసీ రేపటి ఆశతో జీవిస్తున్నవారు కోట్లమంది ఈ భూమిపై ఉన్నారు అలాంటి వారి ఆసక్తి, ఈ 2012 విశ్వసమాప్తి హెచ్చరికలు దానికి సంభందించిన వివరాల వెబ్‌సైట్లు, పుస్తకాలు, వస్తువులకు గిరాకీ పెరుగుతుంది.