Custom Search
Home
Karimnagar News
Top Stories
Life Style
Entertainment
KARIMNAGAR BLOG
- - - - - - - - - - - - - - - - - -
Karimnagar History
Mandals
Karimnagar Details
MPs & MLAs
- - - - - - - - - - - - - - - - - -
Piligrim Places
Tourism
Industries
- - - - - - - - - - - - - - - - - -
FORUM
Links
Education
Classifieds
Events
Job Listings
- - - - - - - - - - - - - - - - - -
Charities & Trusts
Telangana Udyamaalu
Mana Pandugalu
Sahityam
KNR Profiles
- - - - - - - - - - - - - - - - - -
Contact Us
BUY A SERVICE
FREE Services
KNR Member's Blogs
Members Login





Lost Password?
Subscribe Newsletter




Karimnagar Classifieds

Telngana Dhoom Dhaam - Palle Bata

తెలంగాణా ధూంధాం - యుఎఈ తెలంగాణీయుల సందడి
telangana dhoom dham - sandhadi - palle pata UAE DUBAI Celebrationయుఎఈలో పల్లె పాట పేరుతో నిర్వహించిన తెలంగాణా ధూంధాం కార్యక్రమం విజయవంతమయింది, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో మన తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ ధూంధాం కార్యక్రమంలో యుఎఈలోని తెలంగాణా వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మార్చి 28, శుక్రవారం న దుబాయిలోని అతిపెద్ద ఆల్‌నార్ లీజర్‌ల్యాండ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా జానపద కళాకారులు రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, విజయ, కవిత మరియు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సెలవు రోజు కావడంతో ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడంతో చాలా మంది వెనుదిరిగి వెళ్ళవలసి వచ్చింది.

తెలంగాణా ప్రవాసాంధ్రుల సంస్థ పక్షాన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుంద్రంగి గ్రామానికి చెందిన జువ్వాడి శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు, ప్రవాస తెలంగాణా కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ లో క్రొత్తగా ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్‌లో గల్ఫ్ ప్రయాణికులకు యూజర్ చార్జీలు మినహాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.telangana dhoom dham - sandhadi - palle pata UAE DUBAI Celebration

ఈ సభ ప్రత్యెక తెలంగాణా ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని తెలంగాణా జానపద గాయకుడు రసమయి బాలకిషన్ అన్నారు, గల్ఫ్‌లో నివసిస్తున్న పేద కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, తెరాసతోగాని మరే ఇతర రాజకీయ పార్టీలతోగాని తమ సంస్థకు సంబంధంలేదని అన్నారు.

ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్రశంకర్ మాట్లాడుతు గల్ఫ్ ప్రవాసీయుల చేయూత లేకుండా తెలంగాణా ఆర్థికాభివృద్ది, మనుగడ లేదన్నారు. గల్ఫ్‌దేశాల నిండి హైదరాబాద్‌కు వచ్చే పేదకార్మికుల మృతదేహాలని స్వస్థలాలకు చేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు.
తెలంగాణా నిరుద్యోగ పరిస్థితి ఆర్థిక వెనుకబాటుతనం గూరించి ప్రవాసీయులపై ఉత్తరం కొడకా అంటూ విజయ పాడిన పాట కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది. telangana dhoom dham - sandhadi - palle pata UAE DUBAI Celebration