Custom Search
Home
Karimnagar News
Top Stories
Life Style
Entertainment
KARIMNAGAR BLOG
- - - - - - - - - - - - - - - - - -
Karimnagar History
Mandals
Karimnagar Details
MPs & MLAs
- - - - - - - - - - - - - - - - - -
Piligrim Places
Tourism
Industries
- - - - - - - - - - - - - - - - - -
FORUM
Links
Education
Classifieds
Events
Job Listings
- - - - - - - - - - - - - - - - - -
Charities & Trusts
Telangana Udyamaalu
Mana Pandugalu
Sahityam
KNR Profiles
- - - - - - - - - - - - - - - - - -
Contact Us
BUY A SERVICE
FREE Services
KNR Member's Blogs
Members Login





Lost Password?
Subscribe Newsletter




Karimnagar Classifieds

Real Hero Durishetti Kiran Kumar

రియల్ హీరో దురిశెట్టి కిరణ్ కుమార్

Durishetti Kiran Kumar2004 జూన్ 21, జమ్మూ కాశ్మీర్‌లోని దాబార్ పర్వతాల్లో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో భారత ప్రభుత్వం 10మంది నిష్ణాతులై సైనుకులని వారిని ఎదుర్కోవడానికి పంపింది, బృందానికి నాయకత్వం వహిస్తున్నది మన జిల్లా కొరుట్లకు చెందిన దురిశెట్టి కిరణ్ కుమార్, రాత్రి 9 గంటలు దాటింది...చిమ్మ చీకటి లక్ష్యం ఎక్కడుందో తెలియదు, లక్ష్యాన్ని చేదించనిదే వెన్నక్కి వెళ్ళకూడదని అందరిలోనూ పట్టుదల, 25సంవత్సరాలు దాటని వారిలోని ఉడుకు రక్తం ఏవిధంగానైనా ప్రాణాల్ని పణంగా పెట్టైనాసరే దేశంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలనే కసి పట్టుదల కన్నుల్లో కనిపిస్తుంది, అప్పుడే తెల తెలవారుతుంది దగ్గరలోనే పాకీస్తాని మిలిటెంట్ల స్థావరం ఉన్నదని....అందరిలోనూ ఒకే పట్టుదల వీరి కుట్రను వమ్ము చేసి తిప్పికొట్తాలని, ప్రణాళిక సిద్దంచేస్తుండగానే అటువైపునుంచి కాల్పులు మొదలయ్యాయి.........

అప్రమత్తమైన భారత యువసేన వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించారు, మన వాళ్లదాటికి తట్టుకోలేక వారు కొంచెం వెనక్కి తగ్గారు...వెనక్కి వెళ్ళిపోయారా చూడాలి మన వాళ్ళు వారిని వెంబడిస్తూ ఆ అడవిలో 24గంటలైనా అలుపెరగని పోరు...వారిని వెంబడిస్తూ మనవాళ్ళు ముందుకు సాగుతున్నారు..చీకటిపడింది అకుంటిత దీక్షతో కిరణ్ తన బృందాన్ని తీసుకుని మరింత ముందుకు సాగాడు.

జూన్ 23 అప్పటికి 30గంటలు గడిచాయి.....దూరంగా కొడల మధ్యలో పారుతున్న జలపాతం గల గల, ఎటువైపునుంచి ప్రమాదం పొంచివుందో తెలియదు..అడుగులో అడుగువెస్తూ పంజా విసిరిన పులుల్లా ముందుకు సాగుతుంది కిరణ్ బృందం, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు...జాగ్రత్త అంటూ తనవారికి చేపుతున్న కిరణ్ కుమార్‌కి సర్రున దూసుకొచ్చిన బుల్లెట్ అతని బుజాన్ని చీల్చేసింది..ఏమవుతుందో గమనించే లోగానే మరో రెండు బుల్లెట్‌లు అతని దేహాన్ని చీద్రం చేశాయి, నొప్పిని పంటి బిగువున ఆపి ఎదురుగా కనిపించిన పొదల్లోంచి వస్తున్న మిలిటెంటుపై దాడి చేశాడు...తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి "నువ్వు దేశంకోసం పోరాడుతున్నావు.. మధ్యలోనే ఈ పవిత్ర వృత్తిని మానాలనిపిస్తే ఇంటికొచ్చేయి,..కాని సజీవంగా మాత్రం కాదు" ఏనాడో ప్రాణాల్ని దేశ రక్షనకై అర్పించాడో..ఆ నాడే అతని శరీరం ఎలాంటి నొప్పినైనా తట్టుకొనే స్థాయికి ఎదిగింది..కిరణ్ దాడికి అటువైపు మిలిటెంట్ కుప్పకూలాడు...అంతలో మరో మిలిటెంటు అతనిపై గ్రనైడ్‌తో దాడిచేశాడు...వందల ఇనుపముక్కలు అతని శరీరంలోకి దుసుకుపోయాయి కొన్ని కిరణ్ కంటిని చీద్రంచేశాయి..కిరణ్ కుప్పకూలిపోయాడు బతికినా దేశం కోసమే బలయినా దేశంకోసమే?

అతని త్యాగం వూరికే పోలేదు..వెనకే వచ్చిన అతని బృందం మిగతా మిలిటెంట్ల పై మెరుపుదాడికి దిగారు ఆ మిషన్‌లో కిరణ్ హతమార్చిన మిలిటెంట్‌తో పాటూ మరో ఇద్దరు మిలిటెంట్లు చావగా మిగిలినవారు కాళ్ళకు బుద్ది చెప్పారు.

ఆరునెలల తరువాత కోలుకున్న కిరణ్ కుమార్ తన దేశభక్తి తనకి ప్రాణాలు పోస్తే, ఒక డోనర్ ద్వారా కంటిచూపు పొందిన కిరణ్, కారు ప్రమాదంలో మరణించిన ఆ అమ్మయి తనకి నేత్రదానం చేయడమవల్లే మళ్ళీ చూడగలుగుతున్నాని చెప్పారు.

కిరణ్‌కుమార్ తండ్రి దురిశెట్టి సత్యనారయణగారు గారు కూడా 1970లో భారత సైన్యంలో జవానుగ చేరి వివిధ హోదాలలో పనిచేసి 1993లో పదవీ విరమణచేశారు, తన కొడుకుకూడ సైన్యంపై అసక్తి చూపడంతో పొంగిపోయిన ఆయన మనసు, కిరణ్‌కి కావాల్సినంత ఉత్సాహం గుండెదైర్యం నింపారు. కిరణ్ 18 ఏళ్ల వయస్సులో 1999లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నపుడే ఆర్మీలో చేరారు, తొలి  విధి నిర్వహణ లాన్స్‌నాయక్‌గా నేరుగా కార్గిల్‌లో అప్పుడు కార్గిల్ యుద్దం జరుగుతున్న సమయం, ఆ తరువాత అస్సాంకి మారారు రాష్ట్రీయ రైఫిల్స్ సభ్యుడిగా కనీసం రెండేళ్లైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్యూటి చేయాల్సి ఉంటుంది. ఆనాటి పాకిస్తాన్ సరిహదుల్లో చేసిన పోరాటం తన జీవితంలో మరిచిపోలేనిదని అన్న ఆయన గత రెండేళ్ళు పూణేలో పనిచేసి ఇటీవలే కేరళలో ప్రత్యేక శిక్షణకై బదిలీ అయ్యారు, చలనంలో వున్న ఏ వస్తువునైనా గురితప్పకుండా కాల్చ గల సత్తాఉన్నా కిరణ్‌కుమార్ నిజంగా రియల్ హీరో మనందరికీ

Durishetty Kiran Kumar - Karimnagar - Korutlaఆ బుల్లెట్ గాయాలు ఈ నాటికి ఆయన శరీరంపై కనిపిస్తాయి, ఇంకా కొన్ని ఇనుప ముక్కలు శరీరంలోపలే ఉండిపోయాయి, కంటి ఆపరేషన్‌తో పాటు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతని అందమైన ముఖాన్ని మళ్ళి తిరిగి అందించగలిగారు మిలిటరీ డాక్టర్ల బృందం. కిరణ్‌ పోరాటాన్ని గుర్తించిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం లక్షా యాభైవేల నగదు పారితోషికం సమర్పించింది, ఎన్ని అవార్డులొచ్చినా దేశానికి చేసే సేవలో పొందుతున్న సంతృప్తి ముందు బలాదూర్ అంటాడు కిరణ్.

పూణేలో కిరణ్‌తో గడిపిన ఎనిమిది గంటలు కరీంనగర్ డాట్ ఇన్‌ఫో కి మరువలేని క్షణాలు.

ఉపాధిలేక గల్ఫ్ బాట పట్టే వారు కొందరైతే, ప్రభుత్వ కొలువులేకపోయినా సరే ఉపాధి కోసం చూస్తూ అధికారుల లంచాల దాహానికి బలవుతున్నవారు కొందరు, నిరాశ నిస్పృహలతో తప్పుదోవ పట్టేవారు కొదరు....ఇటువంటి వారందరికీ భారత ప్రభుత్వం విసురుతున్న సవాల్ ...

మీలో ఆ సత్తా ఉందా??

చేవ గల యువకులకు భారత సైన్యం ఎదురుచూస్తుంది .